భాస్కరాచార్యుడు లీలావతి, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాలు రచించాడు. బ్రహ్మగుప్తుడు ఖండఖ్యాదక, బ్రహ్మస్ఫుట సిద్ధాంతాలను రచించాడు. ఈ రెండు గ్రంథాలను సాధారణ శకం 8వ శతాబ్దంలో అరబ్బీలోకి తర్జుమా చేశారు. ఆర్యభట్టుని ఆర్యభట్టీయం, సూర్యసిద్ధాంతం, గోళాద్యాయం, ఆర్య సిద్ధాంతం మెదలైన గ్రంథాలను రచించాడు. వరహమిహిరుడు బృహజ్జాతకము, బృహత్సంహిత, పంచసిద్ధాంతిక మొదలైన గ్రంథాలను రచించాడు.