బిల్హణుడు విక్రమాంకదేవచరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణిలో గ్రహాల చలనాల గురించి విసృ్తతంగా చర్చించాడు. పరామర భోజుడు యుక్తి కల్పతరువు అనే గ్రంథంలో నౌకా నిర్మాణాన్ని గురించి రకరకాల నౌకలను గురించి తెలిపారు. పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులో రచించాడు.