ఖరోష్టి లిపి కుడి నుంచి ఎడమకు రాసేవారు. ఇది పశ్చిమోత్తర ప్రాంతాల్లో మాత్రమే ప్రబలి సాధారణ శకం 4వ శతాబ్దం నాటికి అంతరించింది. దేవనాగరి లిపి భారత, నేపాల్ దేశాల్లో వ్యాప్తిలో ఉంది. హిందీ, మరాఠీ, నేపాలీ భాషలను రాయడానికి ఈ లిపినే ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని ఎడమ నుంచి కుడికి రాస్తారు. చిత్ర లిపిని రాత ప్రక్రియకి ముందు కాలానికి సంబంధించిన సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ఒక వరుసలో 4 సంజ్ఞలు/అక్షరాలు చెక్కబడి మొత్తం మీద 132 చిహ్నాలతో కూడి ఉండడం వీటి ప్రత్యేకత. బ్రాహ్మీలిపి ఆధారంగా మన దేశంలో అంకెలు రూపుదిద్దుకొన్నాయి. ఇది మన దగ్గర నుంచి అరబ్బులు వారి దగ్గర నుంచి యూరోపియన్లు నేర్చుకొన్నారు.