AP DSC Secondary Grade Teacher 2025 Model Test 4

Show Para  Hide Para 
Question Numbers: 47-53
సూచన: ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి ప్రశ్నలకు సరైన సమాధానములు రాయండి.
పరాసు గవర్నరు డూప్లే తన సైన్యములను సమకూర్చుకొని కడప,కర్నూలు, సవనూరు నవాబులతో కుట్రలు పన్నుటకు మొదలుపెట్టెను. క్రీ.శ. 1750వ సంవత్సరము డిశంబరు నెలలో పఠాను ప్రభువులలో ఒకడగు కందవోలు (కర్నూలు) నవాబు హిమ్మత్ ఖాను. నాజర్ జంగును హత్య చేసెను. అంత డూప్లే ముజఫర్ జంగును విడిపించి తనతో కూడ తన పల్లకిలో ఎక్కించుకొని పుదుచ్చేరికి కొని పోయెను. అపుడు ముజ్ఫర్ జంగు డూప్లెకు పెక్కు బిరుదములు, గ్రామములు ఇచ్చి అతనిని కృష్ణానది మొదలు కన్యాకుమార్యక్రము వరకును ఉన్న అన్ని ప్రాంతములకును నవాబుగా నియమించెను. ముజఫ్ఫర్ జంగును, మృతి చెందిన యతని మేనమామకు ఉత్తరాధికారిగా సింహాసనను ఎక్కించుటకొరకు బుస్సీ సేనాని నాయకత్వమున డూప్లే ఒక పరాసు దళమును సాయమిచ్చి హైదరాబాదుకు పంపెను. కాని మధ్యమార్గమున కడపకు దక్షిణమున 56 కిమీ.ల దూరమున ఉన్న లక్కారెడ్డిపల్లి వద్ద క్రీ.శ. 1751వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో పఠాను నవాబులు ముప్పర్ జంగును తెగటార్చిరి. పిమ్మట రెవెన్యూ మంత్రి శ్రీకాకుళపు రామదాసను నామాంతరము గల రాజా రఘునాథు పరాసు దళవాయియగు బుస్సీకి లంచమిచ్చి అతని మాధ్యస్థ్యమున మొదటి ఆసఫ్ జా మూడవ కుమారుడు సలాబత్ జంగును క్రొత్త నిజాముగా ప్రకటించెను (మార్చి 1751). ఫ్రెంచి వారు పెద్ద పెద్ద జాగీరులు గడించుకొనిరి. దక్కనులో సర్వాధికారములు వారివే అయినవి. పరాసు ప్రాబల్యమును వివరించుచు " ఇచట మనము పాడినదే పాట, ఆడినదే ఆట, లాభములన్నియు మనమే పొందుతున్నాము " అని బుస్సీ ఒకమారు డూప్లెకు వ్రాసెను. బుస్సీ హైదరాబాదులో ఏడెండ్ల కాలముండెను. "బుస్సీ, సంతుష్టాంతరంగుడపై ఉండుము. నీవు గౌరవమర్యాదలతో ప్రవర్తించుచున్నావు." అని డూప్లే బుస్సీకి బదులు వ్రాసెను.
సలాబత్ జంగు నిజాము అగుటకు పీష్వా ఒప్పుకొనలేదు. 1732వ సంవత్సరము మే నెలలో ఘాజిఉద్దీన్ ఒక మహారాష్ట్ర సైన్య రక్షణ క్రింద ఢిల్లీ నుండి బయలుదేరెను.
సహజ రాజనీతి చాతుర్యము గల బుస్సీ మహారాష్ట్రులకు లంచమిచ్చి పీష్వా బాజీరావుతో సలాబత్ జంగుకు సఖ్యము సొసగించి సైనిక రక్షణ సహాయ సంధి కుదిర్చెను. ఇంతలో మాజిఉద్దీను విషప్రయోగముచే మరణించెను. ఇందువలన సలాబత్ గంగుకు నిజాం పదవి స్థిరమయ్యెను. తరువాత ఆరోగ్యము నిమిత్తమైన బుస్సీ మచిలీ పట్టణమునకు తిరిగి పోయెను. ఆయదనున సలాబత్ జంగునకు దివానగు సయ్యద్ లష్కరుఖాను పరాసు సేనలను దక్కను నుండి తరిమివేయవలెనని సంకల్పించెను. అది పసిగట్టి బుస్సీ ఎకాయెకి హైదరాబాదుప పోయి మచిలీపట్టణము నుండి చిలుక సముద్రము వరకు గల ఉత్తర సర్కారులను సొంత జాగీరుగా సలాబత్ జంగు చేత తన పేర మంజూరు చేయించుకొనెను. క్రీ.శ. 1754వ సంవత్సరము డిసెంబరు నెలలో సలాబత్ జంగు శ్రీకాకుము. ఏలూరు, రాజమహేంద్రవరము, ముస్తఫానగరము (కొండపల్లి) అను నాలుగు సర్కారులను పరాసువారికి ఇచ్చి వేసెను. బుస్సీ ఆనాడు ఆరంభించిన సైనిక రక్షణ సహాయ పద్ధతిని తరువాత చాలా కాలమునకు వెల్లస్లీ ప్రభువు అవలంబించెను. ఈ సర్కారుల నుండి వచ్చుచుండిన ఆదాయము ముప్పదియొక్క లక్షలు: సైనిక వ్యయము ఇరువది ఐద లక్షల ఏబది వేలు. పరసువారు మూడు సంవత్సరముల కాలము నుండి పొందుచు వచ్చిన అభ్యుదయమునకు ఈ సర్కారుల లాభము తలమానికము. పరాసు వారి ప్రాభవ ప్రశస్తులు మిన్నుముట్టినవి. ఒకానొక కార్యనిర్వహణార్ధము తనకు సర్కారులు ఈయబడి ఉండుటవ లన పరాసు కంపెనీ యొక్క స్థితిగతులతో ఎట్టి మార్పును కలుగలేదని డచ్చి వారితోను ఆంగ్లేయులతోను బుస్సీ చెప్పెను.
మార్టినొ అను గ్రంథకర్త ' దక్కనులో బుస్సీ ' అను తన గ్రంధములో బుస్సీని గూర్చి యిట్లు వ్రాసియున్నాడు:
' బుస్సీ హిందూ దేశములోని రాజులత మెలగవలసిన పద్ధతులను చక్కగా గ్రహించినాడు. వారి వారికి తగినట్లు మర్యాదతో ప్రవర్తించును. వారి అనుమతి పొందక ఏ కార్యము చేయడు. అతని ప్రవర్తనలో అతని అధికార భావము లేశమయినను పొడగట్టదు. దుర్బలులను, పరాజితులను అతడు ఎన్నడును తృణీకరించినట్లు చూపట్టదు.'
© examsnet.com
Question : 49
Total: 160
Go to Question: