AP DSC Secondary Grade Teacher 2025 Model Test 3

Show Para  Hide Para 
Question Numbers: 45-52
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి, ఇందుగల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
స్వాతంత్ర యోధురాలు ఆనీ మాస్ కేర్నీ బ్రిటీష్ ప్రభుత్వాన్ని, ట్రావెన్ కోర్ సంస్థానాన్ని నిర్భయంగా ఎదుర్కొంది. ధైర్యసాహసాలకు మారు పేరైన ఆనీ, లాటిన్ క్యాథలిక్ కుటుంబంలో 6 జూన్ 1902 లో జన్మించింది. 
ఆమె తండ్రి గేబ్రియల్. మాస్ కేర్నీ ట్రావెన్ కోర్ స్టేట్ లో గవర్నమెంటు ఆఫీసర్ గా పని చేశారు. ఆనీమహారాజా కాలేజీ ట్రావెన్ కోర్ లో ఎమ్.ఎ. హిస్టరీ, ఎమ్.ఎ. ఎకనామిక్స్, డబుల్ డిగ్రీ తో పట్టభద్రురాలైంది. కొన్నాళ్లు ఆమె సిలోన్ వెళ్ళి లెక్చరర్ గా పని చేసింది. తర్వాత తిరిగి ట్రావెన్ కోర్ కి వచ్చి మహారాజా కాలేజిలో ఎల్ ఎల్ బి (లా కోర్సు) చేసింది. 
1925-35 మధ్య కాలంలో ఎంతోమంది యువతీ యువకులు కార్యకర్తలుగా కాంగ్రెస్ లో చెరీ ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. అనీ ట్రావెన్ కోర్ స్టేట్ కాంగ్రెస్ లో చేరిన ప్రథమ మహిళ. ఆనతి కాలంలో ఆమె స్టేట్కాంగ్రెస్వర్కింగ్ కమిటీలో భాగమైంది. అక్కమ్మ చెరియన్, పట్టం ధానుపిల్లలతో కలిసి ఉద్యమ నాయకురాలైంది. బ్రిటీష్ ప్రభుత్వం జాతీయోధ్యమాన్ని అణచివేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. నాయకుల్ని జైల్లో పెట్టి హింసిస్తోంది. ఆనీ చురుకుగా రాజకీయాల్లో పాల్గొనడంవలన 1932-47 మధ్య కాలంలో ఆమెను ఎన్నోసార్లు బ్రిటీష్ పాలకులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1938 ఏప్రిల్ లో ఆమెపై ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఆమె బందువులు ఆస్తిపై దాడులు జరిగాయి. ట్రావెన్ కోర్ రాజ్య పాలకులకు ఆమె ట్రావెన్ కోర్ పౌరులంతా ఉద్యమంలో పని చేయడం అవరోదంలా అనిపించింది. ఆనీకెన్నో బెదిరింపులు, వీటి గురించి ఆమె కంప్లయింట్ ఇచ్చిన లాభం లేకపోయింది. 
దేశానికి స్వతంత్రం వస్తే తమ రాజ్యాన్ని కోల్పోతామనే భయంతో సంస్థానాధీశులు బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ట్రావెన్ కోర్ దివాన్ సి.పి. రామస్వామి అయ్యర్ 1947 తర్వాత ట్రావెన్ కోర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆనీ ట్రావెన్ కోర్ స్టేట్ స్వాతంత్ర భారతదేశంలో వేలీనామ్ చేయాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తోంది. ఆమె అద్భుతమైన వాక్పటిమగల వ్యక్తీ. ఆమె తన ఉపన్యాసాలలో ప్రజలను ప్రభావితం చేస్తోందని 1938 లో 18 నెలలు రాజద్రోహం కేసు పెట్టి ఆమెను నిర్భంధించారు. 
1942 లో 2 సంవత్సరాలు ప్రజలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తోందని జైల్లో పెట్టారు.
1946 లో ఆరు నెలలు ఆమె పుకార్లు పుట్టించి ప్రజలను హింసాయుత కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తోందని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆమె గురించి వార్తాపత్రికలలో వ్యతిరేకంగా రిపోర్టులు రావడంతో ఆ రిపోర్టు చదివిన గాంధీజీ ఆమెను మందలించారు.
1932 లో లెజిస్లేటివ్ అసంబ్లీ ఎగువ, దిగువ సభలతో ఏర్పరిచారు. అటువంటి అసెంబ్లీ ఏర్పరచడం ఇండియాలో మొదటిసారి స్టేట్ కాంగ్రెస్ లో ఉండగా అనీ రాజకీయ రంగంలో 'పాలసీ మేకింగ్', రాజకీయ చతురత, రాజ్య తంత్రంలో ఆరితేరింది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్ని కులాలు, మతాల ప్రాముఖ్యత లేదు.
1938-39 మధ్య కాలంలో ఆనీట్రావెన్ కోర్ ప్రభుత్వంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. 1944 లో ఆమెను ట్రావెన్ కోర్ స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. 1946 లో రాజ్యంగా పరిషత్తు (కాన్స్తిట్యుఎంట్ అసెంబ్లీ) కి ఎంపికైన 15 మన్ది మహిళలలో ఆనీ ఒకరు.
12 అక్టోబర్ 1949న, రాజ్యాంగపరిషత్తులో సర్దార్ పటేల్ దేశంలో ఉన్న చిన్న - చిన్న సంస్థానాలు, పరగణాలను అన్నింటినీ 'ఇండియన్ రోమినియన్' లో విలీనం చెయ్యడం గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ట్రావెన్ కోర్ స్టేట్ ను స్వతంత్ర భారతదేశంలో విలీనం  చెయ్యాలి కృషి చేస్తున్న ఆనీ ఆ సందర్భంలో ఇలా అన్నారు - "స్టేట్స్ విలీనం గురించి నాకున్న భయాలన్నీ పోయాయి. 'బిస్మార్క్ ఆఫ్ ఇండియా' (పటేల్) వివేకం ఎంత గొప్పదో అర్ధం చేసుకోగలం. రక్తపాతం లేకుండా దేశంలో ఉన్న చిన్న చిన్న సంస్థానాలు, ప్రావిన్స్ అన్నింటినీ విలీనం చేసి ప్రజాస్వామ్య దేశంగా ఇండియాను మలచగలిగారు.
ట్రావెన్ కోర్ స్టేట్ లో రాజకీయ అనుభవాలు, ట్రావెన్ కోర్ ని ఇండియాలో విలీనం  చెయ్యాలనే పట్టుదల, ఆనీ మాస్ కర్నీభావాల్ని రూపొందించాయి. రాజ్యంగా పరిషత్ లో ఉన్న మహిళా సభ్యులందరిలో ఆమె విలక్షణమైనది. ఆమె ఉపన్యాసాలు ఆనతి కాలంలో (రాజ్యంగా నిర్మాణ కాలం) నెలకొన్న ఉద్రిక్తతను ప్రతిబిమిస్తాయి. 
1948-52 మధ్య కాలంలో ట్రావెన్ కోర్ - కోచిన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యురాలిగా ఆనీ సేవలందించింది. 1949-50 లో ట్రావెన్ కోర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆరోగ్య శాఖా మంత్రిగా మంత్రిత్వ శాఖను నిర్వహించిన ప్రథమ మహిళా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా, తిరువనంతపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 1951 ఇండియన్ జనరల్ ఎలక్షన్లో ఎన్నికయ్యారు. ఆమె కేరళ నుండి ప్రధమ మహిళగా పార్లమెంటీరియన్ ఆ ఎన్నికలలో పార్లమెంటుకు కేరళ నుండి ఎన్నికైన పదిమందిలో ఆమె ఒకరు. 
© examsnet.com
Question : 46
Total: 160
Go to Question: