మహాభారతంలోని మొత్తం 18 పర్వాలలో భీష్మ పర్వం విశిష్టమైంది. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన వివిధ ధృక్కోణాల మేలు కలయిక భగవద్గీత. దీన్ని ఆంగ్లేయుడు సర్ విల్కిన్స్ ఆంగ్లీకరించాడు. ఇది హిందువుల పవిత్ర మత గ్రంథం. అందరూ చదవవలసిన దార్శినిక గ్రంథం.